Entertainment టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి..
దీపావళి అంటేనే అందరికీ ఎంతో ఆనందం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంత ఉత్సాహంగా జరుపుకునే పండుగలు సెలబ్రిటీలు కూడా అంతే బాగా జరుపుకుంటారు అయితే తాజాగా తన దీపావళి పండుగకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది నటి పూజా హెగ్డే.. ఈ ఫోటోలో లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో భలే అందంగా మెరిసిపోతుంది ఈ భామ దీపావళి వెలుగుల్లో ఉన్న ఫోటోలు షేర్ చేయడమే కాదు నువ్వెక్కడ ఉన్నా సరే నిన్ను నువ్వు ఫాలో అవ్వు అంటూ మెసేజ్ కూడా ఇస్తుంది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులంతా భలే ఉన్నావు పూజ అంటూ కామెంట్లు పెడుతున్నారు..
తన అందంతో నటనతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే అంతేకాకుండా సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది ఈ భామ..ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వెంకటేష్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో సల్మాన్ జోడీగా నటిస్తుంది పూజా హెగ్దే. అలాగే మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా చేస్తుంది..