Entertainment పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే ఈ సినిమాలో రవితేజ రక్షిత ప్రధాన పాత్రల్లో కనిపించారు అయితే ఈ షూటింగ్ సమయంలో జరిగిన ఒక విషయాన్ని చెప్పుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ మన రియాక్షన్ ఎలా ఉంటే తర్వాత పరిస్థితులు అలాగే ఉంటాయంటూ తెలిపారు..
తాజాగా ఆయన రియాక్షన్ పై కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా.. “ఇడియట్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీను రక్షిత ఏడ్వాల్సి ఉంది కానీ ఆమెకి ఎక్స్ప్రెషన్ రావడం లేదు పగలబడి నవ్వుతుంది నాకు విపరీతమైన కోపం వచ్చింది.. సెట్‌లో అందరూ వింటుండగా, ‘రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు. తర్వాతి సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను.. అని చాలా గట్టిగా చెప్పా. తను వెంటనే ‘రాయి.. రాయకపోతే చంపేస్తాను. నీ తర్వాతి పది సినిమాలు నేనే చేస్తా. ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగా చెప్పి చావు’ అని అన్నది. అంతే, ఆ అమ్మాయి స్పందనకు సెట్‌లో అందరూ క్లాప్స్‌కొట్టారు. ఆ మాటలకు నాకు కూడా నవ్వు ఆగలేదు. నేను ఊహించని సమాధానం అది. ఆ అమ్మాయి మీద కోపం మొత్తం పోయింది.. నేను అన్న మాటలకు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. లేదా అలిగి రెండో రోజూ షూటింగ్‌కు రాకపోవచ్చు. కానీ, తను అలా చేయలేదు. మన రియాక్షన్స్ వల్ల లైఫ్‌లో చాలా విసుగు, చికాకులను తగ్గించుకోవచ్చు. ఇవికాకుండా సోషల్‌మీడియాలో ఎవరెవో పోస్టులు పెడతారు. ప్రతి దానికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు. అలాగే న్యూస్… ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్‌గా రియాక్ట్ అయి, వాదించడం అవసరమా? మనం పనికి వచ్చే వాటికే స్పందిద్దాం. నవ్వుతూ చెప్పే సమాధానం, లేకపోతే, ఏ సమాధానం చెప్పకుండా మీరు నవ్వే చిన్న చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు..