Health వేసవికాలంలో పిల్లలకు సెలవులు అనే ఉద్దేశంతో ఎంత ప్రయాణాలు చేసిన కొన్ని ప్రదేశాలు మాత్రం చలికాలంలోనే చూడాలి అప్పుడే అసలైన కిక్ ఉంటుంది అయితే ఇలా చలికాలంలో ప్రయాణం అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పాలి ఇలాంటి సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..
చలికాలంలో ప్రయాణం చేసినప్పుడు ముఖ్యంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోయే ఈ వాతావరణంతో అందరికీ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది అందుకే ఈ కాలంలో ప్రయాణించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే.. చలికాలంలో ఉదయాన్నే లేవాలి అంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది అయినా ప్రయాణం చేసే రోజు ఉదయాన్నే లేచి ప్రయాణాన్ని మొదలు పెట్టడం వల్ల తొందరగా అనుకున్న గమ్యస్థానాన్ని చేరవచ్చు.. అలాగే అర్ధరాత్రి గమ్యస్థానాన్ని చేరుకునేలా కాకుండా కొంచెం వేకువజామునే వెళ్లేటట్టు ప్లాన్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా అక్కడ వాతావరణం ఎలా ఉందో ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకోవడం మంచిది. పొగ మంచు పడే ప్రదేశం అయితే అది ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు దూరంగా ఉండటం మంచిది. అయినా వెళ్లాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే చలికాలంలో ఉపయోగపడే స్వెటర్లు మఫ్లర్లు షూస్ బ్లౌజులు వంటివి ఆ పర్యాటక ప్రదేశానికి వెళ్ళాక కొనుక్కుందాంలే అన్న ఉద్దేశంతో చాలామంది ఆ జాగ్రత్త వహిస్తారు అయితే అక్కడికి వెళ్లాక సమయానికి అవి దొరకొచ్చు దొరకపోవచ్చు లేదా ఆ ప్రదేశాల్లో ఎక్కువ కాస్ట్ కూడా అయి ఉండొచ్చు అందుకే కావాల్సినవన్నీ ముందుగానే జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్లడం మంచిది.. అలాగే బ్లాంకెట్లు తీసుకెళ్లడం మర్చిపోకూడదు.. జలుబు జ్వరానికి సంబంధించి కొన్ని రకాల మందులు వెంట ఉంచుకోవడం మంచిది..