Problems On Latenight Sleep కొంతమంది నిద్రపోవటం కూడా టైం వేస్ట్ గా భావించి సరిగ్గా నిద్రపోరు.. అయితే సరైన నిద్ర లేకపోతే తర్వాత ఎన్నో అనార్థాలు ఎదురుకోవల్సి వస్తుందంటున్నారు నిపుణులు.
సరైన ఫుడ్ తీసుకోకపోతే జరిగే దానికన్నా సరైన నిద్ర లేకపోతే జరిగే అనర్ధాలే ఎక్కువ. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదట్లో విడుదలైన టాక్సిన్స్ బయటికి పోవు ఇవి కేవలం నిద్రపోయే సమయంలో మాత్రమే బయటకు పోతాయి. సరైన నిద్రలేని సమయంలో ఈ టాక్సిన్స్ మెదడులో ఇంకా ఎక్కువగా పెరిగిపోయి విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి తీవ్ర సమస్యలకి దారితీస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే అల్జీమర్స్ కి దారి తీసే అవకాశం ఉంది.
మన శరీరంలో మరీ ముఖ్యమైన అవయవం హృదయం. గుండె 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. మనిషి నిద్రపోయినప్పుడు మాత్రమే గుండె కొట్టుకోవటం తగ్గి దానికి కాస్త విశ్రాంతి దొరుకుతుంది. మనలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. అదే రోజులో 6 గంటల కన్నా తక్కువగా నిద్ర పోతే గుండె పైన భారం పడుతుంది. ఇలా దీర్ఘకాలం కొనసాగితే ఏదో ఒక రోజు కచ్చితంగా గుండెపోటు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరిగ్గా నిద్రపోని సమయంలో బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ విడుదల అయ్యి అవి చర్మం పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. మొహంపై ముడతలకి దారితీస్తాయి. నిద్రపోయే సమయంలో గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇవే మన శరీరాన్ని మన మజిల్స్ ని గట్టిగా ఉంచేటట్టు చేస్తాయి. నిద్రలేని అనేది రోగనిరోధక శక్తి పైన కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.