Entertainment దిల్ రాజు టాలీవుడ్ లో ఎందరో డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చారని చెప్పాలి అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఆర్య 2004 లో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది సుకుమార్ కు ఈ సినిమా మొదటి సినిమా దీంతో ఆయన సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా నిలబడిపోయారు..
అలాగే సిద్ధార్థ జెనీలియా కాంబినేషన్లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసింది 2006లో వచ్చిన ఈ సినిమా తో దర్శకుడు భాస్కర్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు..
అలాగే ప్రభాస్ ఇలియానా కాంబినేషన్లో వచ్చిన మున్నా సినిమా 2007లో విడుదలైంది.. ఈ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన బృందావనం సినిమా మంచి హిట్ అయింది ఎన్టీఆర్ కాజల్ సమంత ప్రధాని పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్షం కురిపించింది.. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే మహేష్ హీరోగా నటించిన మహర్షి సినిమా రాగా.. ఇప్పుడు వారసుడు సినిమా కూడా రాబోతుంది..
ఇక కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాలను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలాగే జోష్ సినిమా ద్వారా వాసు వర్మ ఓ ఫ్రెండ్ సినిమా ద్వారా వేణు శ్రీరామ్.. ఇలా ఎందరో కొత్త దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అంతేకాకుండా వీళ్ళు అందరికీ ఒక కొత్త లైఫ్ ఇచ్చారు..