Entertainment తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంతారా మూవీ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ ఒక సినిమా కోసం ప్రస్తావించటం ప్రస్తుతం చర్చనీయాంసముగా మారింది..
రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార మూవీ రికార్డులు బద్దలు కొడుతుంది.. ఈ చిత్రం కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తోంది.. విడుదలైన దగ్గర్నుంచి రికార్డులు సృష్టిస్తున్న కాంతారా సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది.. అయితే ఈ సినిమాలు మొదటగా కన్నడలో విడుదల చేయగా అక్కడ మంచి హిట్ అందుకుంది ఆ తర్వాత ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేశారు.. అయితే ప్రస్తుతం ఈ సినిమాను వీక్షించిన తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్ లో స్పందించారు..
తమిళ వర్షంలో ఈ సినిమాను చూసిన రజనీకాంత్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ఈ సినిమాను ఇంత బాగా తీసినందుకు తన అభినందనలు తెలియజేశారు.. “మనకి తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఆ విషయాన్ని సినిమాల ద్వారా హోంబలే ఫిలిమ్స్ కంటే ఎవరూ గొప్పగా చెప్పలేరు. రైటర్, డైరెక్టర్, యాక్టింగ్‌లో రిషబ్ శెట్టి స్కిల్స్‌కి హ్యాట్సాప్.. కాంతార మూవీ చూస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇండియన్ సినిమాకి మాస్టర్ పీస్ లాంటి సినిమా తీసిన టీమ్ మొత్తానికీ అభినందనలు” అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు