Entertainment ప్రస్తుతం ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ వార్తలే వినిపిస్తూ వస్తున్నాయి వీరిద్దరి మధ్య వస్తున్న రోమట్లకు మరింత బలం చేకూరుస్తూ వీరిద్దరూ తాజాగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఇందులో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలుపుతూ లిప్ కిస్ కూడా ఇచ్చుకున్నారు అయితే ఇదంతా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది ఈ సందర్భంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మరొకసారి స్పందించారు..
ప్రస్తుతం నరేష్ పైన నడుస్తున్న వివాదాలపై అతని మూడే భార్య రమ్య రఘుపతి స్పందించారు ఆమె నుండి ఇతను ఇంకా విడాకులు తీసుకొని సంగతి తెలిసిందే అయితే విడాకులు మాత్రం అతనికి కచ్చితంగా ఇవ్వనంటూ చెప్పకు వచ్చిన రమ్య రఘుపతి మరిన్ని విషయాలను తెలిపింది.. ఈ సందర్భంగా నరేష్ చాలా దుర్మార్గుడు అంటూ చెప్పుకొచ్చింది అలాగే అతనికి ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే ఎన్నో తప్పులు చేశాడని తెలిపింది..
అలాగే దేవుడి లాంటి కృష్ణగారితో తనకు అక్రమ సంబంధం ఉందని నరేశ్ ఆరోపించినట్లు రమ్య తెలిపారు. అలాగే కృష్ణ గారు ఇంటి పరువు తీయకూడని ఇన్ని రోజులు నేనేమి మాట్లాడలేదని కానీ రోజు రోజుకు నరేష్ దారుణాలు పెరిగిపోతున్నాయని అందుకే ఇప్పుడు మాట్లాడాలి చూస్తుందంటూ చెప్పుకొచ్చారు..
అలాగే “నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని నరేశ్ చేయని పనులు లేవు. చివరికి కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. నాకు ఇంజంక్షన్ సూట్ పంపారు. అందులో నా నుంచి కృష్ణగారికి ప్రాణహాని ఉందని రాశారు. అంతకంటే దారుణం ఏంటంటే.. దేవుడి లాంటి, తండ్రి స్థానంలో ఉన్న కృష్ణగారికి నాతో అక్రమ సంబంధం ఉందని సూట్‌లో చెప్పారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇందుకు సంబంధించిన పత్రాలపై కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. నరేశ్ చేసే పనుల వల్ల ఆయన గౌరవం దెబ్బతినకూడదని కృష్ణ గారితో ఏమి చెప్పలేదు నా నుంచి విడాకులు తీసుకోకుండానే ఇతను ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వను కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. పవిత్ర తో మొదటిసారి నాకు పరిచయం చేసినప్పుడు ఎంతో ఆప్యాయతగా మాట్లాడాను నా చేతితోనే అన్నం వండి వడ్డించాను కానీ వీరిద్దరూ కలిసి నాకే మోసం చేశారు..” అంటూ చెప్పుకొచ్చారు