Entertainment ప్రముఖ డాన్సర్, నటి రాఖీ సావంత్ తరచు వార్తల్లో నిలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన భర్తతో జరుగుతున్న గొడవలతో మరొకసారి వార్తల్లో నిలిచారు. తన భర్త తనను హింసిస్తున్నారని గృహ హింస కు తాను తట్టుకోలేకపోతున్నాను అంటూ పోలీస్ కేసు పెట్టారు. ఈ విషయంపై అతను ఇప్పటికే 14 రోజులు కష్టపడి లో ఉన్న సంగతి తెలిసిందే ఇది ఇలా ఉండగా ఇతనిపై ఒక ఇరాన్ మహిళ రేప్ కేసు పెట్టడం ప్రస్తుతం చర్చిని అంశంగా మారింది..
రాఖీ సావంత్ భర్త ఆదిల్ పై ఇరానీ మహిళ రేప్ కేసు నమోదు చేసింది. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.. మైసూర్ లో సదరు మహిళ ఈ కేసును నమోదు చేయించింది. అంతే కాకుండా ఐదు నెలల క్రితమే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అతనికి వేరే మహిళలతో ఎఫైర్ ఉందన్న విషయం తనకు తెలియదంట చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇలాగే చాలామంది మోసపోయారని కానీ వాళ్ళు ఎవరు బయటకి రాలేకపోతున్నారని చెప్పుకొచ్చింది..
అయితే రాఖీసావంత్ సైతం గృహహింస కేసు పెట్టినప్పుడు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకొని తనను మోసం చేస్తున్నాడని అతనికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఇవి ఏవి చెప్పకుండా తనను మోసం చేస్తున్నాడని ఇప్పటికి తన పందా మార్చుకోవడం లేదని తెలిపింది..