Entertainment రవితేజ ను ఒక రకంగా హీరోగా నిలబెట్టిన చిత్రం ఇడియట్ అని చెప్పాలి 2003లో వచ్చిన ఈ సినిమా ప్రేమ కథలకు కొత్త అర్ధాన్ని చెప్పింది అప్పటివరకు మోసవరంలో కొనసాగుతున్న ప్రేమకథా చిత్రాలకు తెరపడిందని చెప్పాలి ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసింది..
దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ మహారాజ్ రవితేజతో ఇడియట్ సినిమాతో మ్యాజిక్ చేశాడని చెప్పాలి.. ఇందులో రవితేజ సరసన రక్షిత నటించింది.. ఈ సినిమా లవ్ స్టోరీ అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తూ వస్తున్నాయి అలాగే ఇందులో రవితేజ కొడుకు హీరోగా ఇంటర్వ్యూ పోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.. అయితే మహదాన్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రను మహదాన్ చేశాడు. అంధుడిగా అతడు నటించి మెప్పించాడు.
అయితే ఈ విషయంపై తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న రవితేజ క్లారిటీ ఇచ్చేశారు.. ఇడియట్ 2 సినిమాకి హీరోగా రవితేజ కుమారుడు మహదాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త వినిపిస్తూ వస్తుంది అయితే ఈ విషయంపై స్పందించిన రవితేజ.. “ఈ వార్తల్లో అస్సలు నిజం లేదు. ఇడియట్ సీక్వెల్ మా అబ్బాయితో చేసే ప్రణాళిక లేదు.. అయినా ఈ విషయం వినడానికే కొత్తగా ఉందని.. ” రవితేజ చెప్పుకొచ్చారు.