Entertainment స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించిన తొలి చిత్రం కిరాక్ పార్టీ.. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు అయితే ఈ సినిమా విడుదలై నేటికి ఆరేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు కానీ ఇందులో రష్మికను ప్రస్తావించకపోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది..
రక్షిత్ శెట్టి హీరోగా రష్మిక మందన నటించిన తొలి చిత్రం కిరిక్ పార్టీ ఈ సినిమాకు దర్శకుడు రిషబ్ శెట్టి.. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది 2016 డిసెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం తో సినీ బృందానికి మంచి పేరు వచ్చింది అయితే ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మూవీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ దర్శకుడు రిషబ్ శెట్టి ఓ ట్వీట్ చేశారు. హీరో, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ పేరుని యాడ్ చేసిన రిషబ్.. రష్మిక మందన్న పేరుని యాడ్ చేయలేదు..
ఈ సందర్బంగా రిషబ్.. ‘‘మా సినిమా రిలీజై ఆరేళ్లు అవుతుంది. థియేటర్స్‌లో మీరు మా కోసం చేసిన సందడి, వేసిన విజిల్స్‌ను మరచిపోలేం. అవి మా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయి. ఆ రోజుల్లోకి మమ్మల్ని మళ్లీ తీసుకెళ్లాయి. ఈ సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అని ట్వీట్ పెట్టారు రిషబ్ శెట్టి. అలాగే హీరో రక్షిత్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణ సంస్థ పరమ్‌వహ్ స్టూడియోస్ పేరుని ట్యాగ్ చేశాడు. కానీ రష్మిక మందన్న పేరుని ట్యాగ్ చేయలేదు. దీంతో ఇంతకుముందు రష్మిక వీరిపై చేసిన కామెంట్లకు సరైన సమాధానం చెప్పారు అంటూ నటిజన్లో కామెంట్లు పెడుతున్నారు..