Entertainment దర్శకుడు ధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం విదేశాల్లో కూడా తన సత్తా చాటుతోంది ఆర్ఆర్ఆర్.. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జపాన్లో ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు అయితే అక్కడ ఈ సినిమా ఎంత వసూలు చేసింది అంటే..
ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే వసూళ్లను కూడా అంతే స్థాయిలో రాబట్టింది ప్రస్తుతం ఈ చిత్రం జపాన్లో కూడా మంచి వస్తువుల్లోనే రాబడుతుంది.. అక్కడ విడుదలై నా నాలుగు రోజుల్లో రెండు కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం అయితే చిత్ర బృందం మాత్రం అక్కడ ఇంతకంటే ఎక్కువగానే వసూలు చేస్తుందని ఆశించారు కానీ రెండు కోట్లు మాత్రమే వసూలు చేయటం కొంత నిరాశ కలిగించిన విషయమై అయినప్పటికీ అక్కడ ఏమాత్రం వసూలు చేయడం కూడా మంచి విషయమైనా చెప్పాలి..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అలాగే జపనీయులు మన సౌత్ ఇండియా సినిమాలను చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాగే అక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు మంచి అభిమానులు ఉన్నారు.. అలాగే మన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జపాన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆయన తర్వాత అంతే స్థాయిలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆ స్థాయి అభిమానులను సంపాదించుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి..