Entertainment బాలీవుడ్ హీరో సోను సూద్ సినిమాలతో కన్నా తన నిజ జీవితంలో చేసిన పనులతోనే మంచి పేరు సంపాదించుకున్నారు.. కరోనా సమయంలో ఎందరో పేదలని ఆదుకొని తన మంచి మనసును చాటుకున్నారు.. వెనుక ముందు ఆలోచించకుండా ఎంతోమందికి సాయం చేస్తూ రియల్ హీరో అయిపోయారు సోనుసూద్.. అయితే ఆ తర్వాత కూడా ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు అందుకున్నారు..అయితే తాజాగా ఈయన చేసిన ఓ పని వల్ల ప్రస్తుతం విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు..
ఇప్పటివరకు అందరూ సోనుసూద్ ని పొగిడే వాళ్లే ఆయన చేసిన మంచి పనులు అందరికీ అరకంగా గుర్తుండిపోయాయి.. ఎంతమంది దేవుడుగా భావించే సోనోసు ప్రస్తుతం ట్రోలింగ్ గురవటానికి కారణమేంటంటే.. తాజాగా.. రీసెంట్ గా సోనూసూద్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ట్రైన్ లో హాయిగా సీట్ లో కూర్చోకుండా.. కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించాడు. హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.ఇలాంటి పనులు చేసి.. ఇంకా కుర్రాళ్ళాకు ఉత్సాహం కలిగిస్తున్నారా..? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అంటూ.. తెగ ట్రోల్ చేస్తున్నారు. రైలు వెళుతున్నప్పుడు అలా డోర్ నుంచి బయటకు వేలాడటం ఎంత ప్రమాదకరమో మీలాంటి వాళ్లకు తెలియనిది ఏముంది.. ఇలాంటి పనులు చేసి బాధ్యత రహస్యంగా వ్యవహరించడమే కాకుండా మరింత మందిని ఆ దారిలో తీసుకు వస్తారా.. ఇలాంటివి ఇంకా సోషల్ మీడియాలో పెడితే యువత ఏమైపోతారు.. అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు..