Entertainment బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తాజాగా అర్ అర్ అర్ ఆస్కార్ పై స్పందించారు ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఆస్కార్ వస్తే ఒకసారి పట్టుకుని అవకాశం ఇవ్వండి అంటూ రాంచరణ్ కు ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే..
ఎన్టీఆర్ రామ్ చరణ్ పోటాపోటీగా నటించిన ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఏ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ సినిమాను తరగతికించారు అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం షాట్ లిస్టులోనే ఉన్నప్పటికీ తుదినామినేషన్స్ జనవరి 24న ప్రకటించనున్నారు అయితే దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ స్పందించి ఏమన్నారంటే.. పటాన్ సినిమా ట్రైలర్ విడుదలై అందరినీ అలరించింది.. అయితే సౌత్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, దళపతి విజయ్ తెలుగు, తమిళ్ ట్రైలర్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయడంపై షారుఖ్ వారికి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే రామ్ చరణ్.. ‘షారుఖ్ సర్.. మిమ్మల్ని ఇంతకుముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్సెస్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన షారుఖ్.. ‘మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు కృతజ్ఞతలు. మీ RRR టీమ్ ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి!! లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చారు