Entertainment సాయి పల్లవి తన నటనతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది అలాగే ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలతో నటించిన ఈమె త్వరలోనే నటనకు స్వస్థి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఈ విషయంపై స్పందించింది సాయి పల్లవి… ఇప్పట్లో నటనకు గుడ్ బాయ్ చెప్పే ఆలోచన లేదంటూ స్పష్టం చేసింది..
సాయి పల్లవి త్వరలోనే తన నటనకు గుడ్ బాయ్ చెప్పేసి వెళ్లిపోనుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వస్తున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు ఈ భామ అయితే తాజాగా దీనిపై స్పందించిన సాయి పల్లవి ఏమంటుందంటే… “ప్రేమమ్ సినిమాతో నా సినీప్రయాణం మొదలైంది. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ఆ చిత్రంలో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో అది ఒకటి. నేను ఎంబీబీఎస్ చదివినా.. నటిని కావాలనుకున్నాను. నా నిర్ణయానికి మా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నేను నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలని అనుకుంటాను. నా పాత్రలు వాళ్లకి ఎప్పటికీ గుర్తుండాలని భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కథలు ఉంటే ఏ భాషలో అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అలాగే సినిమాలో వదిలిపెట్టాలి అనే ఆలోచన ఇప్పట్లో లేదు కొన్నాళ్లు అనుకున్న విధంగా సినిమాల్లో కొనసాగి ఆ తర్వాత మాత్రమే వైద్యవృత్తిని ఎంచుకుంటాను.. ” అంటూ చెప్పకు వచ్చారు సాయి పల్లవి..