Samantha : ఇటీవల సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన మయోసైటిస్ చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసమే సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని సమాచారం. అయితే అమెరికాకు వెళ్లి మయోసైటిస్ చికిత్స తీసుకుంటాను అన్న సమంత ప్రస్తుతం మనశాంతి కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ ప్రశాంతత ధ్యానం, పూజలు చేసిన సమంత ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తుంది.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్. బాలిలోని పలు దేవాలయాలని, ప్రకృతి ప్రదేశాలని సందర్శిస్తూ ఆ ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత.
తాజాగా బాలిలో నేల, నీరు, నింగి ఒకేచోట ఉన్నట్టు అనిపించే ప్రదేశంలో సమంత ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఉలువాటు అనే టెంపుల్ కి కూడా వెళ్ళింది సమంత. ఇక అక్కడ ఎక్సర్‌సైజ్ లతో ఆరోగ్యాన్ని పెంచుకుంటుంది. మొత్తానికి సమంత ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రదేశాలకు వెళ్తూ మెడికల్ పద్దతిలో కాకుండా ప్రకృతితో నయమయ్యేలా చేసుకుంటుందని సమాచారం. ఇలాగే సమంత వరల్డ్ టూర్ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.