Gossip News: సౌత్ ఇండియా హీరోయిన్స్ బాలీవుడ్ వెళ్తుంటే బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ ఇండియా హీరోస్ పై మక్కువ చూపిస్తున్నారు. ఇదేంటి ఇలా చెప్తున్నారని ఆలోచిస్తున్నారా. నిజమేనండి నిన్న మొన్నటి వరకు రకుల్ సమంత పూజ రష్మిక కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేరనే చెప్పుకోవాలి. కాగా ఈ భామలు ఇప్పుడు బాలీవుడ్ పై హవా చూపుతున్నారు. బాలీవుడ్ భామలు కూడా సౌత్ ఇండియన్ మూవీస్ పై ఇంట్రెస్ట్ బాగానే చెబుతున్నారు. అయితే వీరిపై వచ్చే గాసిప్ ఏంటో ఒకసారి చదివేయండి మరి.
సమంత షాహిద్ కపూర్ తో మూవీలో నటిస్తున్నట్లు గాసిప్ వినిపిస్తుంది. అలానే కీర్తి సురేష్ రణవీర్ సింగ్ తో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా బాలీవుడ్ బ్యూటీస్ సంగతి కి వస్తే సారా అలీ ఖాన్ ధనుష్ తో మూవీ తీసి హల్చల్ చేసింది. అనన్య పాండే విజయ్ దేవరకొండ తో తీసిన మూవీ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇదంతా ఇలా ఉంటే.
ఈ ముద్దుగుమ్మలో సౌత్ ఇండియాలో ఆ హీరో తో నటించాలని ఉంది అని అడగక సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని చెప్పనే చెప్పుకో వచ్చింది. జాన్వి కపూర్ కూడా ఎన్టీఆర్ తో నటించాలని వార్తలు సోషల్ మీడియాలో గాసిప్ గా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే ఆ తారలే నేరుగా చెప్పేవరకు ఆ వార్తలు గాసిప్ వార్తగానే ప్రచారం అవుతాయి.