Krishna : సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ బాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. నాన్న అంటే నాకు దేవుడు ఆయనే నాకు అన్ని అని మహేష్ బాబు పలు సంధర్భాల్లో తెలిపారు. ఇప్పుడు కృష్ణ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు మహేష్. కాగా సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దీంతో ఒకే ఏడాదిలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను కోలుపోవడం మహేష్ కి తీరని లోటు అనే చెప్పాలి. ఏదేమైనా ఈ సంవత్సరం మహేష్ బాబుకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాది జనవరి 9న మహేష్ అన్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆసమయంలో మహేష్ కరోనాతో బాధపడుతున్నారు. ఇక ఆ కారణంతో అన్నను కడసారి చూడలేక పోయారు మహేష్. ఇక సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ మరణం మహేష్ బాబును మరింత విషాదం లోకి నెట్టింది.
రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ మాట్లాడుతూ… నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు అంటూ మహేష్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక మహేష్ బబౌ అభిమానులంతా #staystrongmaheshanna అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. కొంతమంది సినీ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు.