Entertainment సోనూ సూద్.. సినిమాల్లో విలన్ గా ఎన్నో పాత్రల్లో తనదైన గుర్తింపు తెచ్చుకొన్నారు. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా ఎంతో మంది ప్రజలను ఆదుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేశారు.. అలాగే బయట కూడా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. సినిమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటూ త్వరలోనే ఆయన మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. ‘ఫతే’ మూవీతో రచయితగా మారనున్నారు సోనూ సూద్. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి..’బాజీరావు మస్తానీ’, ‘శంసేరా’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అభినందన్ గుప్తా సహాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా డిజిటల్ మోసాల నేపథ్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గత ఏడాదిన్నర నుంచి ఈ స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లు వివరించారు.
‘ఫతే’ సినిమా కోసం చాలా కష్టపడ్డనని చెప్పుకొచ్చిన ఆయన.. ఎథికల్ హ్యాకర్లతో సంప్రదింపులు జరిపానని.. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. సోనూసూద్ బ్యానర్ శక్తి సాగర్ ప్రొడక్షన్లో.. ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. 2023 జులై-ఆగస్టు నాటికి విడుదల చేస్తామని నటుడు సోనూ సూద్ తెలిపారు. ఫతే తరవాత ఇ నివాస్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా ‘కిసాన్’ ప్రారంభిస్తామని సోనూ సూద్ అన్నారు.