Entertainment మెగా డాటర్ శ్రీజ కొణిదెల తరచూ తన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే విషయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.. ప్రతి నిత్యం సోషల్ మీడియాలో ఆమె గురించి ఏవో ఒక వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.. అయితే తాజాగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది..
శ్రీజ కొణిదెల.. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో ప్రతినిత్యం విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పాలి సోషల్ మీడియాలో ఆమె గురించి ఎప్పుడూ ఏవో ఒక వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి ఆమెన్ ట్రోల్ చేసేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయంశం అంశమైంది.
ఇటీవలె ఆమె కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్లారు. వారితో ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటూ ‘నా కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా స్వీకరిస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో భర్త కళ్యాణ్ తో శ్రీజ విడాకులు తీసుకున్నట్టు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న.. దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..