Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో అత్యంత ఎక్కువ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారనేది వాస్తవం. జబర్ధస్త్ మాత్రమే కాకుండా… ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటు బుల్లితెరపైనే కాకుండా… వెండితెరపై కూడా తమదైన కామెడీతో అలరిస్తున్నారు జబర్దస్త్ కమెడీయన్స్. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీం మెంబర్ నుంచి టీం లీడర్‌గా ఎదిగి… ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా చేస్తున్నాడు సుధీర్.
బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా సుధీర్ సందడి చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న చిత్రం గాలోడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించగా… సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది. ఈ మేరకు సుధీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే అంతగా ఇష్టం ఉండదని. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే… మేం ఇద్దరం పట్టుకోం, ముట్టుకోం… కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం అందుకే వర్కౌట్ అయ్యింది అన్నారు. అలానే తన పెళ్లి గురింకీ అడగగా తాను పెళ్లి చేసుకోనంటూ… షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.