Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒక లెజెండ్ ను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోగా… ఘట్టమనేని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నటశేఖర నుంచి సూపర్ స్టార్ గా కృష్ణ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం అని చెప్పాలి. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే కృష్ణ పేరే గుర్తొస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమాలను తెరకెక్కించి తనదైన శైలిలో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కృష్ణ జీవితంలో కూడా తీరని కోరికలు ఉన్నాయట.
అవేంటంటే… తన కొడుకులతో కలిసి నటించాలని ప్రతి తండ్రికి ఉండే కోరికే. అయితే ఆ కోరిక కృష్ణ చిన్నప్పుడే నెరవేరింది. రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించారు. కాగా మహేష్ కొడుకు గౌతమ్ తో నటించాలని కృష్ణ ఆశపడ్డారట. వన్ నేనొక్కడినే తరవాత మహేష్ సినిమాలో గౌతమ్ తో పాటు ఆయన కూడా కలిసి నటించాలని కోరుకున్నారట. కానీ ఆ కోరిక తీరలేదు.
ఇక కృష్ణకు చిన్నతనం నుంచో వ్యాఖ్యాతగా చేయడం ఇష్టమట. హిందీలో అమితాబ్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి టాక్ షోను తెలుగులో తీసుకొచ్చి హోస్ట్ గా చేయాలని అనుకున్నారట. ఆ కోరిక కూడా నెరవేరకుండానే కృష్ణ ఈ లోకాన్ని వీడారు. పలు పౌరాణిక పాత్రల్లో కనిపించిన కృష్ణకు ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించాలని బాగా కోరిక ఉండేదట. కానీ కథ మంచిది దొరక్కపోవడంతో వెనకడుగు వేశారట.
అలానే సూపర్ స్టార్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ గా చూడాలని కృష్ణ పలు సంధర్భాల్లో ఓపెన్ గానే చెప్పారు. కానీ మహేష్ టక్కరి దొంగ ప్లాప్ కావడంతో మరోసారి అలాంటి పాత్రలు చేయడానికి నిరాకరించడంతో ఆ ఆశ కూడా నిరాశగా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఈ కోరికలు తీరకుండానే కృష్ణ వీడ్కోలు పలకడం అందరికీ విషాదాన్ని కలిగిస్తుంది.