Entertainment నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మూడేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికీ ఆయన మరణం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతూనే వస్తున్నాయి అయితే ఈయన డ్రగ్స్ కు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టు పలు వాదనలు వినిపించినప్పటికీ ఈయనది అసలు ఆత్మహత్య కాదు హత్య అంటూ తాజాగా కొందరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన దగ్గర నుంచి ఎన్నో వాదనలు వినిపిస్తూనే వస్తున్నాయి.. ముఖ్యంగా ఈ క్రమంలోనే నెపోటిజంపై పలు వాదనలు వినిపించాయి అలాగే ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు హత్య చేసుకున్నారంటూ పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఈ విషయంపై సుశాంత్ సింగ్ రాజ్పుత్కు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ స్పందించారు..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి లోపల ఉన్నప్పుడు ఒక విఐపి డెడ్ బాడీ అంటూ నాకు చెప్పారు ఆయన ఎవరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని అన్నారు నేను వెళ్లి చూసేటప్పటికి అతని మెడపై శరీరం పైన గాయాలు ఉన్నాయి అది చూసి నేను వెంటనే ఇది కచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అంటూ నేను చెప్పాను అయితే ఈ విషయం చెప్తే పోలీసులు ఒప్పుకోరు తొందరగా పోస్టుమార్టం నిర్వహించండి అంటూ వారు నన్ను కంగారుపెట్టారు అంతేకాకుండా పోస్టుమార్టం నివేదిక ఆత్మహత్య అంటూ ఇవ్వాలని అనటంతో ఆ సమయంలో నేనేమీ చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు దీంతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మరొకసారి తెరపైకి వచ్చింది..