Entertainment కోలీవుడ్ స్టార్ కపుల్ నయంతర విగ్నేష్ శివన్ గత కొన్ని రోజుల క్రితం నుండి తరచు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే.. పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఇద్దరు పిల్లలకు తల్లి నట్టు సోషల్ మీడియా వేదికగా తెలపడంతో వివాదాలు తెరతీసాయి.. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించిన రిపోర్ట్ లో ఈ దంపతులకు క్లీన్ షీట్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం…
నయనతార విగ్నేష్ శివన్ సరోగసి పద్ధతిలోనే ఇద్దరు పిల్లలకు తల్లి తండ్రి అయ్యారని నిరుపితమైపోయింది..
తమిళనాడు గవర్నమెంట్ ఆదేశించిన విచారణలో వీరికి క్లీన్ చీట్ లభించింది.. 2016 మార్చిలోనే తమకి వివాహమైనట్లు నయనతార, విఘ్నేస్ మ్యారేజ్ సర్టిఫికెట్‌ని కమిటీకి సమర్పించారు. అలానే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిబంధనల ప్రకారమే తాము సరోగసి ద్వారా కవలలు జన్మించినట్లు ఆధారాల్ని కమిటీకి ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను ఈ కమిటీ తమిళనాడు హెల్త్ మినిస్టర్ కి సమర్పించింది.. నయనతార, విఘ్నేస్ దంపతులు సరోగసీ 2021 యాక్ట్ ప్రకారం కవల పిల్లల్ని పొందినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టరీ ఈరోజు అధికారికంగా ప్రకటిస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది.
అయితే 2016 లోనే పెళ్లి చేసుకున్న నయనతార.. అధికారికంగా మాత్రం ఈ ఏడాది పెళ్లి చేసుకుంది.. బహుశా సినిమాలకు దూరం అవటం ఇష్టం లేకను మరే కారణాలతోనైనా మీరు పెళ్లిని రహస్యంగా ఉంచి ఉంటారని నెటిజన్లో అనుకుంటున్నారు..