Entertainment తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ ఇప్పటికీ మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్న నటి ప్రగతి. అయితే లాక్ డౌన్ తర్వాత నుంచి ఆమెలోని మరో యాంగిల్ బయటపడింది. సోషల్ మీడియాలోనూ ఆ వర్కౌట్ వీడియోస్ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆమెనే నటి ప్రగతి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన గురించి పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది.
తనది పెద్ద కటౌట్ కావడంతో.. తనని ఇబ్బంది పెట్టేవాళ్లని బయపెడుతుంటానని చెప్పింది. మిగతా వాళ్లలా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోనని, వెంటనే డోసు ఇచ్చేసి, క్లాస్ పీకుతానని క్లారిటీ ఇచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేస్తానని చెప్పడంతో టీనేజ్ లో పెద్దగా సినిమాలు చేయలేకపోయాను. ఇక హీరోయిన్లకు తల్లిగా నటించేటప్పుడు.. అవి కాంప్లిమెంట్ కావాలి అని ప్రగతి చెప్పింది. ఎలా ఉన్నాసరే తాను అందగత్తెనే అని, తనకు సినిమాలొస్తాయని ప్రగతి ధీమాగా చెప్పింది. తనకు తాను అందంగా ఉన్నానని సర్టిఫికెట్ కూడా ఇచ్చేసుకుంది. వర్కౌట్స్ వల్ల తన అందం కాదు.. బలం, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పింది. ఇప్పటికీ క్యాట్ వాక్ చేస్తుంటానని తెలిపింది. కుడిచేతిపై ఓ మచ్చ ఏర్పడటంతో.. దాన్ని కవర్ చేసుకునేందుకు టాటూ వేయించుకున్నానని ప్రగతి చెప్పింది. మరి ప్రగతి చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
కాగా, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతి, చిన్నప్పుడు కార్టూన్ పాత్రలకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక డిగ్రీ ఫస్టియర్ లో ఉండగానే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా రెండేళ్లలో ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ సినిమా చేసింది. ఆ తర్వాత పెళ్లి కావడంతో సినిమాలు వదిలేసింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత మూడు భాషల్లో సీరియళ్లతో రీఎంట్రీ ఇచ్చింది. దానితో పాటే తెలుగు సినిమాల్లోనూ మదర్ క్యారెక్టర్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది.