Unni Mukundan : మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పై వున్న ఆరోపణ గురించి తెలిసిందే ,గత కొంతకాలంగా మహిళా వేధింపు కేసులో నిందుతుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్నాడు. 2017 ఆగస్టు 23న సినిమా విషయం గురించి చర్చించేందుకు ఉన్ని ముకుందన్ కొట్టాయంకు చెందిన ఒక మహిళతో సమావేశం అయ్యాడు. ఆ సమయంలో ముకుందన్ ఆమె పై దాడి చేసినట్లు.. ఆ మహిళ సెప్టెంబర్ 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దాని పై ముకుందన్ స్పందిస్తూ.. “ఆ మహిళ చెప్పిన మాట్లల్లో నిజం లేదు. ఆమె నా పై కేసు ఫైల్ చేసే ముందు నా నుంచి 25 లక్షలు డిమాండ్ చేసింది. అవి ఇస్తేనే కేసులో ఇరికించకుండా ఉంటానని ఆమె బెదిరించిందని” పేర్కొన్నాడు.
అంతేకాదు ఆమె విషయం లో తన తప్పు ఏం లేదు అని , ఆమె పై పరువు నష్టం కేసు ఫైల్ చేసి, తన పై పెట్టిన కేసుని కొట్టేయాలంటూ మేజిస్ట్రేట్ కోర్టు, సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్ట్ ఆ పిటిషన్ కొట్టేసి విచారణ ఎదురుకోవాలని కోరింది. ఆ తరువాత 2021లో కేరళ హైకోర్ట్ లో ముకుందన్ తరుపు లాయర్.. ఫిర్యాదు చేసిన మహిళతో విషయం సెటిల్ అయ్యిపోయిందని అఫిడవిట్ సబ్మిట్ చేసి కేసు పై స్టే పొందారు. అయితే ఆ అఫిడవిట్‌లో ఉన్న సంతకం ఆ మహిళది కాదని ఆమె తరుపు లాయర్ కోర్టుకి స్పష్టం చేయగా.. న్యాయవాది ఆ విషయం పై సీరియస్ అయ్యారు . దీని వల్ల ఈ వివాదం ఇంకా సీరియస్ ఇయ్యింది .
ఈ కారణం గా ఆమె పెట్టిన కేసు ని పరిగణలోనికి తీసుకుంటారేమో అని కొందరి స్టేట్ మెంట్స్