Entertainment తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వడ్డే నవీన్ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అలాంటి మంచి నటుడు అకస్మాత్తుగా సినిమాలు మానేసి కనుమరుగ అయిపోయాడు. అయితే కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఆలీతో సరదాగా షోకు వడ్డే నవీన్ ను తీసుకు రమ్మని ఎన్నోసార్లు అభిమానులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికీ దానికి సంబంధించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చూద్దాం..
వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు.. వాటిలో పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్‌హిట్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలా కథానాయకుడిగా 90వ దశకం చివరి నుంచి 2010 వరకూ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు వరుస సినిమాలతో అలరించారు.
అయితే సంస్థ జ్ఞాపిక ప్రొడక్షన్స్… వడ్డే నవీన్ ను ఎంతగా తమ షో కు రావాలని పిలిచినా అంగీకరించలేదని లేదని తెలిపారు. ప్రస్తుతం ఏ షోలకూ తను రావడం లేదని వడ్డే నవీన్ అన్నారని అందుకే తమని, అనిల్‌ని తిట్టవద్దని జ్ఞాపిక ప్రొడక్షన్స్ నిర్మాత ప్రవీణ అన్నారు. ఇదే విషయమై ఆలీ మాట్లాడుతూ.. “వడ్డే నవీన్‌ను చాలా సార్లు పిలిచాం. దానికి ఆయన ‘‘తప్పకుండా మీ షోకు వస్తాను. కానీ, ఏదైనా అద్భుతం చేసి వస్తా’ అని అంటారు. మా ఇద్దరి మధ్య స్నేహం దాదాపు 30ఏళ్లుగా కొనసాగుతోంది. మేమంతా చెన్నైలోని ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఒక నిర్మాత కుమారుడన్న గర్వం ఎప్పుడూ ఆయనకు లేదు. స్నేహానికి మంచి విలువ ఇచ్చే మనిషి ఆయన” అని ఆలీ చెప్పుకొచ్చారు. మరి వడ్డే నవీన్ ను చూడాలన్న ఆయన అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.