Kantara Movie : కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుమారు 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడలో ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల తన అదిరిపోయే రెస్పాన్స్ తో మంచి విజయాన్ని దక్కించుకుంది. భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు హైలైట్ అంటే క్లైమాక్స్ అనే చెప్పాలి.
సినిమా చివర్లో రిషబ్ శెట్టి నటన చివరిలో వచ్చే పాట సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయి. అయితే చివరిలో వచ్చే వరాహ రూపం పాట పై కేరళకు చెందిన మ్యూజిక్ బ్రాండ్ తుక్కుడం బ్రిడ్జ్ పలు విమర్శలు చేసింది. ఐదేళ్ల క్రితం తమ బ్రాండ్ రూపొందించిన నవరసం సాంగ్ మ్యూజిక్ మాదిరిగానే వరాహారూపం సాంగ్ ఉందంటూ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు తీర్పు మేరకు ఈ పాటను యూట్యూబ్ నుంచి కూడా తొలగించారు.
తాజాగా ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఓటిటీ లో ఈ సినిమాలో క్లైమాక్స్ పాటను మార్చేశారు. ఆ పాట ట్యూన్ ను మార్చి… మ్యూజిక్ కూడా మార్చేశారు. ఆ మ్యూజిక్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటీలో కూడా దూసుకుపోతుంది.