Entertainment దీపావళి పండుగను సెలబ్రిటీలు అందరూ తమ ఇంట్లో ఎంత ఘనంగా జరుపుకున్నారు అయితే మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం తన దీపావళి పండుగను ఈ ఏడాది ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకున్నారు.. అంతేకాకుండా తాను అనుకున్న విధంగా దీపావళి పండుగను జరుపుకొని అభిమానుల మనసులు గెలుచుకున్నారు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది తన దీపావళి పండుగను కుటుంబంతో కాకుండా ఓ దివ్యాంగ పాఠశాలలో జరుపుకోవడం విశేషం దృష్టిలోపం ఉన్న ఓ దివ్య పాఠశాలకు వెళ్లిన వరుణ్ తేజ్ దీపావళి సందర్భంగా అక్కడ ఉన్న వారందరికీ టపాసులు పంచిపెట్టారు టపాసులను పంచిపెట్టారు అంతేకాకుండా వారందరికీ స్వీట్స్ పంచిపెట్టి ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేశారు.. అయితే దీపావళి సందర్భంగా మెగా నటుడు చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు అంతేకాకుండా సూపర్ హీరో అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు..
“ఈ దీపావళి పండుగ నేను ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకున్నా..దీపావళి అనేది వెలుగులు నింపే పండగే కాకుండా అందరికీ ఆనందానికి పంచేది… కాబట్టి నేను వీరి జీవితాల్లో కొంతైనా ఆనందాన్ని తీసుకురావాలని ఈ ప్రయత్నం చేశాను. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. మన వల్ల ఓ వ్యక్తి నవ్వాడంటే నిజంగా అది ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.. వాళ్ల సంతోషం చూసి నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది.. చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు మనకు తగినంత సహాయం ఎదుటివారికి చేయడమే నిజమైన ఆనందాన్నిస్తుంది.. “అని చెప్పుకొచ్చారు..