పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అప్డేట్లను ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తాజాగా డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు. లైగర్ మ్యాడ్ నెస్ను వీక్షించేందుకు రెడీగా ఉండండి.. డిసెంబర్ 31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.
డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నారు. ఇండియాలోనే అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం టీం అంతా కూడా ప్రాణం పెట్టి పని చేసింది. లైగర్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
సాంకేతిక బృందం:
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా