Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో ఎక్కువ ఫేమ్ ని సంపాదించుకున్నాడు అనడంలో పెద్ద సందేహం లేదు అని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా విజయ్ కి ఫ్యాన్ అయ్యిపోయారు. పాన్ ఇండియా సినిమా లేకుండానే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. కానీ ఒక సినిమా మొత్తం మార్చేసింది.
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమా విజయ్ దేవరకొండని బాగా బాధించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా విజయ్ మీద తన యాటిట్యూడ్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. అయితే విజయ్ ఇప్పుడు తన యాటిట్యూడ్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు స్టేజి పై విజయ్ మాట్లాడుతుంటే ఒక యాటిట్యూడ్ కనిపించేది. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది.
ఇక తాజాగా ఖుషి మూవీ ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ..
“నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాలి. అప్పుడే నేను నేర్చుకోగలను. నన్ను గైడ్ చేయడానికి ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకు ఒక సక్సెస్ వస్తే దాని నుంచి విజయం వైపు ఎలా వెళ్ళాలి అనేది అర్దమవుతుంది. అలాగే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనం ఏమి చేయకూడదు కూడా అర్ధమవుతుంది. మనం చేసిన తప్పుని మనం గ్రహించగలగాలి. అలాకాకుండా దానిని బలవంతంగా ప్రజల పై రుద్దాలి అని చూస్తే ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవి హిట్ సినిమా అయితే ఆడియన్సే బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇస్తారు. నా నెక్స్ట్ మూడు సినిమాలకు నేను మాట్లాడకూడదు, నా పనే మాట్లాడాలని సైలెంట్ గా ఉంటున్నా” అని చెప్పుకొచ్చాడు