Seema Sinthakaya : సీమ చింతకాయ.. ఇధి వినగానే కస్టపడి గడకట్టే తో రాల్చడమే గుర్తొసస్తుంది . అంతా కస్టపడేది ధాని రుచి కోసమే, పల్లెటూరిలో పుట్టి, పెరిగిన వారందరికీ దీని గురించి తెలుసు. ఈ చెట్లు పొలాల్లో, గట్లవెంబడి, రోడ్లపక్కన ఎక్కువగా ఉంటుంటాయి. వేసవికాలంలో సీమ చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని సీమచింతకాయలని, గుబ్బ కాయలని, తొలి చింతకాయలనీ ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ కాయ పచ్చిగా ఉన్నప్పుడు వగరు గాను, పండిన తర్వాత తియ్యగా ఉంటుంది. సీమ చింతకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది, పోషక విలువులు మెండుగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ కరిగిస్తుంది..
సీమచింతలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. సీమచింతలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడేవారు ఈ కాయ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 1 స్పూన్ ఈ గింజలు తింటే.. గుండెకు మంచిది. వీటిని జాగ్రత్తగా వలిచి విత్తనాలని తీసేసి అప్పుడు తినడం మంచిది .కాయ పండినదో లేదో ఆ విత్తనాన్ని చూస్తే తెలుస్తుంది. విత్తనం నల్లగా వుంటే తియ్యగా ,పచ్చగా వుంటే వగరగా వుంటుంది .
యాంటీ క్యాన్సర్ లక్షణాలు..
సీమ చింతకాయలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ కాయ ఆకులలోని యాంటీకాన్సర్ ఏజెంట్లు రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీ క్యాన్సర్ లక్షణాలు వుండడం వల్ల ఈ సీమ చింతకాయలు తినడం అనెది క్యాన్సర్ రాకుండా అరికడతాయి.