Entertainment పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుంది అంటూ క్రేజీ న్యూస్ అందిన దగ్గర నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఆ సినిమాని సత్యాగ్రహి అయితే పలు కారణాలతో ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం అయితే తాజాగా దీనిపై స్పందించారు నిర్మాత ఏఎమ్ రత్నం..
పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా మొదట్లోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని.. మరో బ్లాక్ బస్టర్ గా నిలవ నుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది ఈ విషయంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ సైతం ట్వీట్ చేశారు.. ఇందులో ఇది పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కకపోయే సినిమా దీనిని సినిమాగా చూపించి ప్రజలను మెప్పించే కన్నా అవి బయట చేసి ప్రజలకు మేలు చేయడం మంచిది అంటూ చెప్పకు వచ్చారు అయితే ఈ విషయంపై తాజాగా నిర్మాత మరొకసారి స్పందించారు..
ఈ విషయంపై నిర్మాత ఎఎమ్ రత్నం ఏమన్నారు అంటే.. …“జాని చిత్రం రిజల్ట్ చూసాక, పవన్ చాలా నిరాశపడ్డారు. ఆయన డైరక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని భావించారు. దాంతో సత్యాగ్రహి చిత్రంపై మా డబ్బుని రిస్క్ చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేసారు ”.. అంటూ చెప్పుకొచ్చారు..