Gossip తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల రీమేక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’తో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడాయన మరో మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని తెలిసింది.
మమ్ముటి కీలక పాత్రలో అమల్ నీరద్ తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ పర్వం’. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించే పనిలో పడ్డారట రామ్‌చరణ్.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ ఐదు న విడుదలైన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకుంది.. ఈ రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి గ్రాస్ ను అందుకుంది.. అయితే ఇప్పుడాయన మరో మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ‘భీష్మ పర్వం’ రీమేక్ రైట్స్‌ను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అలాగే మెగా ఫ్యామిలీ హీరోస్ తో రెండు రీమేక్‌లు చేసి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఓ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.. ఇక ఇందులో మమ్ముటి పాత్రను చిరంజీవి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేశ్‌తో ‘భోళా శంకర్’, బాబీతో వాల్తేరు వీరయ్య.. చిత్రాలు చేస్తున్నా