బహుముఖ నటుడు సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ET’. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది.
ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాల్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్ బబ్లీ గా ఉండే పాత్ర పోషించింది. సామరస్యంగా వున్న ఓ గ్రామాన్ని ఒక నేరస్థుడు అతని ముఠా గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో గ్రామంలో సామరస్యం దెబ్బతింటుంది. సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎటువంటి చర్య తీసుకున్నాడనేది కథ ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది.