Eluru News : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియతో రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజల్లో తీవ్ర ఉత్కరంఠ నెలకొంది. కౌంటింగ్‌కు, పోలింగ్‌కు మధ్య సుమారు 20 రోజులకుపైగా వ్యవధి ఉండటంతో పొలిటికల్ ఫీవర్ ఏలూరు జిల్లాలో బలంగా కొనసాగుతుంది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 8 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేసి 7 అ సెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును జూన్ 4న (మంగళవారం) నిర్వహించనున్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో 8 కౌంటింగ్ హాళ్ల సిద్ధం చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 హాళ్లు, అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా టేబుళ్లు ఏర్పాటుచేశారు. మరో హాలులో పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 చొప్పున 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 17 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉంది. రెండు రౌండ్లల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధించారు. అలాగే ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించి డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. కౌంటింగ్ రోజు వరకు లూజ్ (విడి) పెట్రోలు విక్రయాలపై నిషేధాజ్ఞ లు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం సమీపంలో రెండు కిలోమీటర్ల పరిధి మేర జనసమూహం లే కుండా చర్యలు తీసుకోవడంతో పాటు సమీపంలోని ఫంక్షన్ హాళ్ల వద్ద నిఘా ఏర్పాటుచేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా వైద్యబృందం, మూడు అంబులెన్సులు సిద్ధం చేశారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్