Peddapalli Disrict News : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఓ సూక్ష్మ కళాకారుడు క్యారెట్ పై తెలంగాణ అమరవీరుల స్తూపం చెక్కి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ చిత్రకళాకారుడు ఆడెపు రజనీకాంత్ క్యారెటీపై తెలంగాణ అమరులను స్మరిస్తూ నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని 5.5 సెంటీమీటర్ల ఎత్తు మరియు 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు మూడుగంటల పాటు శ్రమించి వెజిటేబుల్ కార్వింగ్ ఆర్ట్స్ ద్వారా తెలంగాణ అమరవీల స్థూపాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రజలకు ఆవిర్చావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతకుముందు చాక్ పీస్ పై 2 సెంటీమీటర్ల ఎత్తు 1 cm వెడల్పుతో అమరుల స్థూపాన్ని అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తుతో 2 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. అదేవిధంగా చాక్ ప్రేవీస్ లపై తెలంగాణ తల్లి, తెలంగాణలోని ప్రసిద్ధకట్టడాలను కూడా తయారు చేశారు.